TG: అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సంసిద్ధతను పరీక్షించేందుకు మసాబ్ టాంక్ హాకీ గ్రౌండ్లో అర్ధరాత్రి భారీ మొబిలైజేషన్ డ్రిల్ నిర్వహించారు. గోల్కొండ జోన్‌కు చెందిన సుమారు 650 మంది పోలీసులు ఇందులో పాల్గొన్నారు. డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రిల్‌లో స్పందన సమయం, అధికారుల మధ్య సమన్వయం, రక్షణ పరికరాల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.