»Massive Transfers Of Ips Officers In Ap Transfer To Sps Of Many Districts
Transfer : ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు – పలు జిల్లాల ఎస్పీలకు ట్రాన్స్ఫర్
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) బదిలీల పర్వం కొనసాగుతున్నది. ఐఏఎస్‌ను ట్రాన్స్ఫర్ చేసిన 24 గంటల్లోనే ఐపీఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. 12 జిల్లాలకు కొత్త ఎస్పీలను తీసుకొచ్చింది.శుక్రవారం 54 మంది ఐఏఎస్ (IAS) అధికారులను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్‌లను (IPS) బదిలీ (Transfer) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) బదిలీల పర్వం కొనసాగుతున్నది. ఐఏఎస్‌ను ట్రాన్స్ఫర్ చేసిన 24 గంటల్లోనే ఐపీఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. 12 జిల్లాలకు కొత్త ఎస్పీలను తీసుకొచ్చింది.శుక్రవారం 54 మంది ఐఏఎస్ (IAS) అధికారులను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్‌లను (IPS) బదిలీ (Transfer) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 39 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి (CS Javahar reddy) రెండు జీవోలను విడుదలచేశారు. ఏలూరు రేంజ్ డీఐజీగా జీవీజీ అశోక్‌కుమార్‌ను, గుంటూరు రేంజ్ ఐజీగా జీ. పాలరాజు, అనంతపురం డీఐజీగా ఆర్ఎన్ అమ్మిరెడ్డి, సెబ్ డీఐజీగా ఎం. రవిప్రకాశ్‌ను నియమించారు.ఇక ఏపీఎస్పీ డీఐజీగా బీ. రాజకుమారి, డీజీపీ ఆఫీస్ అడ్మిన్ డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి, గ్రేహౌండ్స్ డీఐజీగా కోయ ప్రవీణ్, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీగా శంఖబ్రత బాగ్చీ,