NLR: హత్యాయత్నం కేసులో కోవూరు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.చైతన్య నిందితుడికి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు. కోవూరు మండలం వేగూరు గ్రామం పల్లిపాలేనికి చెందిన పూనామల్లి అశోక్‌పై అదే గ్రామానికి చెందిన గండవరపు కృష్ణయ్య టెంకాయలు కోసే కత్తితో 2022 జనవరి 15న దాడి చేశాడు. మెడపై నరికి హత్యాయత్నం చేశాడు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.