NLG: పెద్దవూర మండలం పులిచెర్లలో విద్యుత్ షాక్తో ఆదివారం పాడిగేదె మృతి చెందింది. పొలంలో మేపుతుండగా స్టార్టర్కు వెళ్లే విద్యుత్ తీగ తగలడంతో గేదె చనిపోయిందని యజమాని మాడుగుల లక్ష్మమ్మ తెలిపారు. గేదె మృతితో ఆర్థికంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె వేడుకున్నారు.