Pawan Kalyan : హరీష్ శంకర్ మెగా ఫోన్ పట్టి నాలుగేళ్లు కావొస్తోంది. గద్దలకొండ గణేష్ తర్వాత మరో సినిమా చేయలేదు హరీష్. చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మాత్రమే సినిమా చేస్తానని ఇన్నాళ్లు వెయిట్ చేశాడు. ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్లు, సోషల్ మీడియాతోనే టైం పాస్ చేశాడు.
హరీష్ శంకర్ మెగా ఫోన్ పట్టి నాలుగేళ్లు కావొస్తోంది. గద్దలకొండ గణేష్ తర్వాత మరో సినిమా చేయలేదు హరీష్. చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మాత్రమే సినిమా చేస్తానని ఇన్నాళ్లు వెయిట్ చేశాడు. ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్లు, సోషల్ మీడియాతోనే టైం పాస్ చేశాడు. కానీ ఫైనల్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లడంతో.. ఫుల్ ఖుషీ అవుతున్నాడు హరీష్. రీసెంట్గా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా ఉస్తాద్ ఊచకోత షురూ.. అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ష్టేషన్లో కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఓ వైపు గన్, మరో వైపు టీ గ్లాస్ పట్టుకుని ఉన్నాడు. అయితే ఈ ఫోటో బ్యాక్ సైడ్ నుంచి ఉంది. దీంతో ఈ పోస్టర్లో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ పవర్ స్టారే. పవన్ సినిమాలో పవన్ కాకాపోతే.. ఇంకెవరు ఉంటారు. అసలు ఈ డౌట్ రానే రాదు. కానీ హరీష్ శంకర్ మాత్రం ఫస్ట్ పోస్టర్‌తోనే మ్యాజిక్ చేసేశాడు. పవర్ స్టార్ కుర్చీలో కూర్చున్నది పవన్ కాదనేది చాలామంది వాదన. ఆ పవర్ ఫుల్ చైర్లో కూర్చున్నది పవన్ కాదు.. హరీష్ శంకర్ అని అంటున్నారు. నిజంగానే ఈ పోస్టర్‌ను ఒకటికి రెండు సార్లు చూస్తే.. హరీష్ శంకర్‌లానే కనిపిస్తున్నాడు. కానీ చూడగానే.. ఠక్కున పవన్ అని చెప్పేసేలా ఉన్నాడు. అయినా ఆ చైర్లో ఉన్నది పవనా, లేక హరీష్ శంకరా.. అనేది తేల్చుకోలేకపోతున్నారు నెటిజన్స్. దీంతో హరీష్ శంకర్‌ను కాస్త ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. అసలు సినిమానే ‘తేరీ’ రీమేక్ అంటుంటే.. పోస్టర్ కూడా డూపేనా.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. అలాగే అన్నా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో హీరో ఎవరని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ చైర్లో ఉంది పవనో, హరీష్ శంకరో మీరే తేల్చుకోండి.