AP: గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజుకు CM చంద్రబాబు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘అశోక్ గజపతిరాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ఏ పదవి చేపట్టినా హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తారు. ఈ నూతన బాధ్యతలను కూడా అంతే అంకితభావంతో, నిష్పక్షపాతంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మరోసారి శుభాభినందనలు’ అని రాసుకొచ్చారు.