లైగర్ ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఆటిట్యూట్ చూసి.. సినిమా హిట్ అవడం ఖాయమనుకున్నారు. కానీ తీరా థియేర్లోకి వచ్చాక.. చేతులెత్తేశాడు లైగర్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకొని ఉంటే.. రౌడీ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకునే వాడు. అలాగే రెట్టింపు ఉత్సాహంతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ షూటింగ్ జరిగేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ప్రస్తుం విజయ్ చేతిలో ‘ఖుషి’ సినిమా మాత్రమే ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఈ సినిమా తర్వాత రౌడీ ప్రాజెక్ట్స్ ఏంటనేది ఓ పట్టాన తేలడం లేదు.
ఈ మధ్య జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలొస్తున్నాయి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్టు టాక్. కానీ ఇంకా అఫిషీయల్ కన్ఫర్మెషన్ లేదు. ఇదిలా వుండగానే.. విజయ్ దేవరకొండకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ బడా సంస్థలు రౌడీతో చర్చలు జరుపుకుతన్నట్టు టాక్. ఇటీవలే బాలీవుడ్(bollywood) నిర్మాత కరణ్ జోహార్ ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం విజయ్‌ని సంప్రదించారని తెలుస్తోంది. ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించే అవకాశం ఉందట.
అలాగే షారుఖ్ ఖాన్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్’ కూడా రౌడీని సంప్రదించినట్టు సమాచారం. ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కోసం షారుఖ్ సంస్థ ట్రై చేస్తోందట. ప్రస్తుతం ఈ రెండు నిర్మాణ సంస్థలతో రౌడీ చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయని ఇండస్ట్రీ టాక్.. ఈ నేపథ్యంలో విజయ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇంట్రెస్టింగ్ మారింది.