PDPL: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు సింగరేణి CMD ఎన్.బలరాం బుధవారం తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ నుంచి సివిల్స్ ప్రిలిమ్స్ పాసై మెయిన్స్‌కు హాజరవుతున్న అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.