KDP: జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం జలాశయం నుంచి రైతుల పంట పొలాల సాగు కోసం మైలవరం జలాశయం నీటిని గురువారం విడుదల చేయనున్నారు. జలాశయం దక్షిణం కాలువ, ఉత్తరం కాలువలను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నీటిని విడుదల చేస్తున్నట్లు జలాశయం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బుధవారం మీడియాలో తెలిపారు. ఉత్తర, దక్షిణ కాలువలోకి ఎవరు దిగరాదని తెలిపారు.