KDP: పత్తి సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏవో ఓబులేసు రైతులకు సూచించారు. వేముల మండలం వీ.కొత్తపల్లి, అమ్మయ్య గారిపల్లె గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్ల, పచ్చ దోమల ఉధృతి ఎక్కువగా ఉంటే పూత రాలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. వీటి నివారణకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖల అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు.