NLR: కలువాయి మండలంలోని 21 గ్రామాలలో ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకానికి 5,658 మంది రైతులు అర్హత పొందినట్లు మండల వ్యవసాయ అధికారి సీహెచ్ కళా రాణి తెలిపారు. జులై 13వ తేదీలోపు గ్రీవెన్స్‌లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందే అవకాశం కలదన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేశారు.