KDP: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నూతనంగా వెలుస్తున్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల అనుమతుల మంజూరు విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బీ) జిల్లా కన్వీనర్ రాజేంద్ర ప్రసాద్ కలెక్టర్ కార్యక్రమంలో ఏవో విజయ కుమార్కు వినతిపత్రం అందజేశారు.