SKLM: సరుబుజ్జిలి మండలం కొత్తకోట పీఏసీఎస్ డైరెక్టర్‌గా పైడి మురళీమోహన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్‌గా తనను నియమించినందుకు ఎమ్మెల్యే రవికుమార్‌కు, పిసిని చంద్రమోహన్, పేడాడ రామ్మోహన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈయన ప్రస్తుతం సరుబుజ్జిలి మండల జనసేన అధ్యక్షులుగా ఉన్నారు.