MBNR: వ్యవసాయ & వ్యవసాయేతర రుణాలపై బ్యాంకులకు అనుబంధ సంస్థలకు జిల్లా కేంద్రంలో బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా నాబార్డు సీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణ సదుపాయం అందుబాటులో ఉందని దానికి సబ్సిడీ కూడా ఉందన్నారు. కార్యక్రమంలో నాబార్డు జనరల్ మేనేజర్ గణపతి, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.