కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారుల ఆమె తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని ఆమెకు బహూకరించారు. ముందుగా ఆమెకు స్థానిక మహిళలు నాయకులు ఘనస్వాగతం పలికారు.