ప్రకాశం: యర్రగొండపాలెం మండలం పాలూట్ల గ్రామంలో పెద్దపులి టెన్షన్ స్థానిక ప్రజలను వెంటాడుతూనే ఉంది. గురువారం మరో మారు స్థానిక అడవిలోకి మేతకు వెళ్లిన ఆవుపై పెద్దపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పెద్దపులి ఆవుపై దాడి చేస్తున్న సమయంలో స్థానిక రైతులు గట్టిగా కేకలు వేయడంతో పెద్దపులి ఆవును వదిలి అడవిలోకి పారిపోయిందని స్థానికులు తెలిపారు.