GNTR: సోషల్ మీడియా మోసాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం తెనాలి డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. ప్రకటనలు చూసి పెట్టుబడులు పెట్టవద్దని, రెట్టింపు లాభాలకు ఆశపడి మోసపోవద్దని హెచ్చరించారు. మోసపూరిత వెబ్సైట్లు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.