VZM: మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని టాస్క్ ఫోర్స్ సీఐ బంగారు పాప సూచించారు. స్థానిక జమ్ము నారాయణపురం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మత్తుకు అలవాటు పడితే జీవితం అస్తవ్యస్తంగా మారుతుందన్నారు. ప్రస్తుతం చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయని వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు.