కృష్ణా: ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసే ప్రభుత్వం తమదని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. మంగళవారం ఉదయం ఆయన మచిలీపట్నం పరాసుపేటలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ను క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన అందజేస్తున్నామన్నారు.