BHPL: చెల్పూర్ మిల్లెట్స్ విక్రయాల నిర్వహణకు ఐడీవోసీ కార్యాలయంలో క్యాబిన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ డీఆర్డీవోకు సూచించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో చెల్పూర్ మిల్లెట్ యూనిట్ నిర్వహిస్తున్న మహిళలతో కలెక్టర్ సమావేశమయ్యారు. నేటి జీవనశైలిలో మిల్లెట్స్ వినియోగం ఆరోగ్యపరంగా చాలా ముఖ్యమని ఆయన తెలిపారు.