KNR: బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్లబాలు అరెస్టును కరీంనగర్ BRS నేతలు సోమవారం ఖండించారు. కరీంనగర్ సైబర్ క్రైమ్ తీసుకు వెళ్లిన ఆయన్ను జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్లు ఏనుగు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ కలిసేందుకు ప్రయత్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు.