GNTR: తెనాలి సుల్తానాబాద్‌కు చెందిన స్వర్ణకారుడు దామర్ల రామకృష్ణ వ్యాపారంలో నష్టాలతో డిప్రెషన్‌కు గురయ్యాడు. దాదాపు రూ. 48 లక్షల అప్పుల ఒత్తిడిలో పురుగు మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూ.10 లక్షల రుణంపై స్థానిక ఏసుబాబు ఒత్తిడి చేయడంతోనే ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.