SRCL: చందుర్తి మండలంలోని తిమ్మాపూర్తో పాటు పలు గ్రామాల్లో మతసామరస్యం వెల్లివిరిసేలా మొహర్రం వేడుకలు ప్రారంభం అయ్యాయి. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం ఉత్సవాలను హిందూ, ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రజలు పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.