AKP: ఓటరు జాబితాలో పొరపాట్లు, సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యన్నారాయణ రావు సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. జూన్ 30 వరకు అభ్యంతరాలు, మార్పులు స్వీకరించి జులై 21న జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఆగస్టు 2న పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక సమావేశం ఉంటుందని అన్నారు.