ASF: దహెగాం మండలం బోర్లకుంట గ్రామ శివారులో బుధవారం గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనది. మృతుడి వయసు సుమారు 45-50 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు తెలిపారు. హిందూ మతం అని గుర్తించారు. తమ పరిధిలో ఎవరైనా మిస్సింగ్ వ్యక్తులు ఉన్నట్లయితే మృతదేహం గురించి సమాచారం తెలిసినవారు వెంటనే తమకు తెలియజేయాలని ఎస్సై విక్రం తెలిపారు.