SRD: సంగారెడ్డి జిల్లాలో డి- అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అర్హత కలిగిన ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు ఈనెల 30లోపు https://grants-msje.gov.in/ngo-login వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు అవేర్ నెస్ వింగ్ సీఐ శ్రీనివాసరావు 8712661735 నెంబర్కు సంప్రదించాలన్నారు.