W.G: తణుకు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని దానికి అధికారులకు సమన్వయం అవసరమని తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గురువారం తణుకు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద జరిగిన తణుకు మాస్టర్ ప్లాన్ తయారీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు ఉన్నారు.