KNR: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జూన్ 26 నుండి 28 తేదీ వరకు కళాభారతి ఆవరణలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ గురువారం తెలిపారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో వివిధ రకాల దేశీ, విదేశీ వంటకాలు,ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి. నగర ప్రజలు, యువత, కుటుంబాలతో కలిసి ఈ రుచులను ఆస్వాదించవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.