MLG: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రోసిడింగ్ కాపీలు అందజేసినప్పటికీ ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక స్థోమత లేక వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏటూరునాగారం, రొయ్యూరు, కన్నాయిగూడెంలో ప్రస్తుత వర్షాకాలంలో ఉన్న ఇంటిని తొలగించి ఎక్కడికి వెళ్లాలనే సందిగ్ధత లబ్దిదారుల్లో నెలకొన్నది.