NTR: విజయవాడలో పలు ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్సులను ట్రాఫిక్ CI కిషోర్ బాబు ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా, తదితర రికార్డులను పరిశీలించారు. డ్రైవర్, హెల్పర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బస్సులో పాఠశాల కాంటాక్ట్ నంబర్, విండోలు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సేఫ్టి కిట్లు చెక్ చేశారు.