ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం(TVK) పార్టీ అధినేత విజయ్‌పై కేసు నమోదైంది. మధురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్‌కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నటుడిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకున్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు.