NZB: GGHలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. యాక్సిడెంట్లో కాలువిరిగి GGHకు వచ్చిన సుమారు 80 ఏళ్ల వృద్ధురాలు బుజ్జమ్మ (పెర్కిట్)కు వైద్యులు చికిత్స చేసి నిర్లక్ష్యంగా షెడ్డు కింద వదిలేశారని స్థానికులు మండిపడ్డారు. ఆమెకు ఎవరూ లేకపోవడంతో రాత్రంతా షెడ్డు కిందనే చలికి వణుకుతూ ఇబ్బంది పడింది. సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.