AP: తెలుగు ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల పనులకు విఘ్నాలు కలగకుండా చూడాలని పవన్ ఆకాంక్షించారు. అలాగే, మట్టి గణపతిని పూజించండి.. పర్యావరణాన్ని కాపాడండి అంటూ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు సకల శుభాలు కలుగజేయాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.