TG: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు స్వీకరించిన దరఖాస్తులకు అంగీకారం తెలిపింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 2020 అక్టోబర్ 10న ప్రభుత్వం జీవో విడుదల చేయగా.. దానిపై హైకోర్టు అదే ఏడాది నవంబర్‌లో స్టే విధించింది. ప్రభుత్వ వివరణతో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు తాజాగా అనుమతించింది.