SRD: జిల్లాలో మాదకద్రవ్యాల ఉనికి లేకుండా అన్ని శాఖలు చిత్తశుద్ధితో పనిచేయాలని ASP సంజీవరావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. 26వ అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం జూన్ 20 నుంచి 26 వరకు వారోత్సవాలు నిర్వహించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అన్ని శాఖలు కలిసి పనిచేయాలని కోరారు.