VZM: విజయనగరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో మాజీ సైనికులచే యోగాంధ్ర కార్యక్రమము స్థానిక రెడ్ క్రాస్ సొసైటీలో నిర్వహించారు. సుమారు 30 మంది పాల్గొన్న ఈ ప్రోగ్రామ్లో యోగా గురువు శ్రీ శివ సుందర రావు యోగసనాలు వేయించారు. కార్యక్రమంలో రాజేశ్వర రావు, జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.