KMR: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని కామారెడ్డి జిల్లాలో వారం రోజులపాటు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను SP రాజేశ్ చంద్ర శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. మాదకద్రవ్యాల వల్ల సమాజానికి తీరని నష్టం అని మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు.