MNCL: జిల్లా TUWJ (IJU)యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి అర్హులైన జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ పాఠశాలలలో ఒకరికి ఉచితంగా విద్యా బోధన, అలాగే మరొకరికి 50% రాయితీ ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన DEO ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. DEOకు యూనియన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.