W.G: మంచిలి గ్రామంలోని శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ఛైర్మన్ నర్సింహమూర్తి, ధర్మకర్తలచే ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే రాధకృష్ణ సహకారంతో అమ్మవారి ఆలయ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని మంచిలి టీడీపీ అధ్యక్షులు శిరగాని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రసిద్ధి గాంచిన ఆలయ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని ఎంపీపీ సూర్యనారాయణ సూచించారు.