Breaking: ఏడుగురు పర్యాటకులు మృతి, 11 మందికి గాయాలు
సిక్కిం(Sikkim)లోని నాథులా(nathula phas) సరిహద్దులో భారీ హిమపాతం ఆకస్మాత్తుగా కూలింది. ఈ క్రమంలో ఏడుగురు పర్యాటకులు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మరోవైపు బాధిత ప్రాంతంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
సిక్కిం(Sikkim)లోని నాథు లా(nathula phas) పర్వత మార్గంలో మంగళవారం భారీ హిమపాతం ప్రమాదవశాత్తు కూలీ పోయింది. ఈ ఘటనలో ఏడుగురు పర్యాటకులు(tourists)మృతి చెందగా, మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో మంచు కింద చిక్కుకుపోయిన మరికొంత మందిని రెస్క్యూ సిబ్బంది వెలికి తీస్తున్నారు. అయితే హిమపాతం సంభవించినప్పుడు 150 మందికి పైగా పర్యాటకులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం మధ్యాహ్నం సమయంలో జరిగిందని అధికారులు చెబుతున్నారు.
అయితే గత నెల మార్చి నుంచి సిక్కింలో సాధారణం కంటె ఎక్కువగా హిమపాతం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నాథులా పాస్‌కు సమీపంలోని JN రోడ్ పరిధిలో 13వ మైలు వరకు మాత్రమే పర్యాటకుల ప్రవేశాన్ని పరిమితం చేశారు. అయితే టూరిస్టులో 13వ మైలు వరకు వెళ్లేందుకు అనుమతించినప్పటికీ, వారిలో చాలా మంది 15వ మైలు వరకు ఎక్కుతున్నారని సిక్కిం ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇండియా, చైనా సరిహద్దులో ఉన్న నాథులా పాస్(nathula phas) సుందరమైన ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కొనసాగుతుంది.