ADB: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ మరణం బాధాకరమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన మరణం భారత రాష్ట్ర సమితికి తీరని లోటని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు.