MNCL: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో బెల్లంపల్లి MLA గడ్డం వినోద్‌కు నిరాశే మిగిలింది. జిల్లా నుంచి చెన్నూర్ MLA గడ్డం వివేక్‌కు క్యాబినెట్ బెర్త్ ఖరారు కావడంతో, వినోద్ వర్గం నిరుత్సాహానికి లోనైంది. MLAగా గెలిచిన తర్వాత మొదటి జాబితాలోనే వినోద్‌కు మంత్రి పదవి వస్తుందనుకున్నా అలా జరగలేదు. రెండో జాబితాలో ఆయన పేరుంటుందని ఆశలు పెట్టుకున్నా నిరాశే మిగిలింది.