MHBD: డోర్నకల్ MLA రామచంద్రు నాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి లభించింది. పెద్దవంగర మండలంలో జన్మించిన ఆయన 2006లో రాజకీయ అరంగేట్రం చేశారు. TDP అనుబంధ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 2006లో పనిచేసి, ఆ తర్వాత 2014 శాసనసభ ఎన్నికల్లో డోర్నకల్ TDP అభ్యర్థిగా, 2018లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2023లో MLAగా ఎన్నికైన ఆయన ప్రభుత్వ విప్‌గా ఉన్నారు.