RR: విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే లక్ష్యమని CI నరహరి అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు విద్యార్థులకు యాంటి డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్, సైబర్ క్రైమ్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CI పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్, ర్యాగింగ్ విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తాయని, వాటి నుండి దూరంగా ఉండాలన్నారు.