ATP: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ 50 దుప్పట్లను ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఎల్లప్పకు అందజేశారు. డాక్టర్ ఎల్లప్ప మాట్లాడుతూ.. ఆసుపత్రికి దుప్పట్లు పంపిణీ చేసిన విజయభాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డాక్టర్ ఎల్లప్ప సంరక్షణ సమితి వారికి మొక్కలను అందజేశారు.