»Kamal Haasan Kannada Language Effect On Shiva Rajkumar
కన్నడ శివరాజ్ కుమార్‌కి కమల్ సెగ
మధ్రాసులో జరిగిన థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో కమల్ మాట్లాడుతున్నప్పుడు సభలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ గారబ్బాయి, అక్కడి అందరి అభిమాన కథానాయకుడు శివరాజ్ కుమార్ కూడా ఉన్నారు. ఇప్పుడు కమల్ మీద కన్నడిగులు ఎంతలా ఫైర్ అవుతున్నారో, శివరాజ్ మీద కూడా అంతే ఫైర్ అవుతున్నారు కర్ణాటకలో.
కమల్ హసన్ మాటలతో అటు కర్ణాటక, ఇటు తమిళనాడులో కూడా ఉపద్రవమే ముంచుకొచ్చింది. సరే, కమల్కైతే ఎలాగైనా సరే ట్రయిల్ తప్పదు. ఎందుకంటే కమల్ మాట్లాడిన మాటలు మామూలువి కావు. రెండు రాష్ట్రాల మధ్యన, రెండు ప్రాంతాల మధ్యన, రెండు భాషల మధ్యన, రెండు వర్గాల ప్రజల మధ్యన చిచ్చు రేపేసింది. అవిప్పుడప్పుడే ఆరేవిలా లేవు. థగ్ లైఫ్ మాట అటుంచి, ఇంకిప్పుడు కన్నడం ఎప్పుడు పుట్టింది, తమిళం ఎప్పుడు పుట్టింది అనే యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం ఇండియా పాకిస్టాన్ వార్ కన్నా ఘోరంగా ఉంటుంది.
ఇందులో మరోట్విస్ట్……మధ్రాసులో జరిగిన థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో కమల్ మాట్లాడుతున్నప్పుడు సభలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ గారబ్బాయి, అక్కడి అందరి అభిమాన కథానాయకుడు శివరాజ్ కుమార్ కూడా ఉన్నారు. ఇప్పుడు కమల్ మీద కన్నడిగులు ఎంతలా ఫైర్ అవుతున్నారో, శివరాజ్ మీద కూడా అంతే ఫైర్ అవుతున్నారు కర్ణాటకలో. తను వేదిక మీద ఉండి కూడా, కమల్ హసన్ బుద్ధి లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడని, అక్కడికి అక్కడే కౌంటర్ ఇచ్చి, కన్నడ భాష ఎంత గొప్పదొ, ఏనాటిదో చెప్పి, కమల్ హసన్ దవడ పళ్ళు రాలగొట్టలేదని, వాజమ్మలా వింటూ కూర్చున్నాడని శివరాజ్ కుమార్ అని చూడకుండా ఆయన మీద రెచ్చిపోతున్నారు కన్నడభాషాభిమానులు.
శివరాజ్ కుమార్ ఇప్పుడు కమల్ రాజేసిన నిప్పులలో శలభంలా తయారయ్యాడు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుటుంబాన్ని అక్కడ దేవుడి కుటుంబంలా చూస్తారు. వాళ్ళ మాటే వేదం. వాళ్ళ మాటే శాశనం అక్కడ. వాళ్ళ కత్తికి ఎదురేలేని పరిస్థితి నుంచి ఇప్పుడు నీకేం బుద్ధి లేరు, కమల్‌కి అంటే బుద్ధిబుర్రా రెండూ లేవని దుమ్మెత్తిపోస్తుంటే, అంతటి శివరాజ్ కుమార్ కాస్త నోరు మెదపలేని పరిస్థితి.
నీరు, భూమి, భాష అనే నినాదం కన్నడిగులకు ప్రత్యేకం, ప్రధానం. పైగా పైవాడెవడో నోరు పారేసుకుంటుంటే సొంత ఇంటి మనిషి అయి కూడా శిశరాజ్ ఏమీ అనలేదనే కన్నడిగులు ఇంకా మండి పడుతున్నారు. దీన్ని మరి శివరాజ్ కుమార్ ఎలా ఫేస్ చేస్తాడో…..మరి చూడాలి.