TG: ఢిల్లీలో బడా మోదీ ఉంటే.. రాష్ట్రంలో చోటా మోదీ ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయన 2 కోట్ల ఉద్యోగాలు అంటే.. ఈయన 2 లక్షల ఉద్యోగాలు అన్నారని మండిపడ్డారు. రైతు బంధు పోయిందని. బోనస్ బోగస్ అయ్యిందని ధ్వజమెత్తారు. ఇదేనా? రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? అని నిలదీశారు.