కర్నూలు: మార్చి 8న జరగబోయే అంతర్జాతీయ మహిళాదినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం కర్నూలు మెడికవర్ హాస్పిటల్ వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.