»Sandeep Reddy Vangas Harsh Post On Dirty Pr Games
అమ్మ బొత్తాయో….దీపికా
దర్శకుడు సందీప్ వంగాతో దీపికా పడుకొనేకి పూర్తిగా చెడిపోయిందన్నది సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతోంది. కథ వినక ముందు ఒకలా, కథ విన్ని తర్వాత ఒకలా. బావున్నప్పుడు ఒకలా, చెడిపోయినప్పుడు మరొకలా. ఇలాఅలా కల్కి హీరోయిన్ దీపికా పడుకొనే వ్యవహారాన్ని ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలోనే దుయ్యబడుతున్నారు.
మొత్తానికి యానిమల్ లాంటి సెన్సేషనల్ హిట్ తీసి, ఇండియన్ బాక్సాఫీసునే గడగడ వణికించిన నేటిమేటి దర్శకుడు సందీప్ వంగాతో దీపికా పడుకొనేకి పూర్తిగా చెడిపోయిందన్నది సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతోంది. కథ వినక ముందు ఒకలా, కథ విన్ని తర్వాత ఒకలా. బావున్నప్పుడు ఒకలా, చెడిపోయినప్పుడు మరొకలా. ఇలా అలా కల్కి హీరోయిన్ దీపికా పడుకొనే వ్యవహారాన్ని ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలోనే దుయ్యబడుతున్నారు. పైగా అంత పెద్ద దర్శకుడితో కయ్యానికి కాలుదువ్వి, తన పిఆర్ టీంతో సోషల్ మీడియాలో రచ్చ చేయించి సందీప్‌ని బజారుకీడుద్దామనుకుంది ఈ బాలీవుడ్ భామ.
కానీ మరచిపోతే ఎలా? ఎంత గట్స్ ఉంటే యానిమల్ లాంటి సినిమా తీసి, వెయ్యి కోట్లు కొల్లగొట్టి, ఇండియన్ హెర్క్యులస్ ప్రభాస్‌తో సినిమా తీయడానికి సిద్ధమవుతున్న సందీప్తోనా గేమ్స్? పప్పులేం ఉడకలేదు. తనేదో చాలా తెలివిగా చేసేను అనుకుంటే సందీప్ ఆ తెలివిని పూర్తిగా పటాపంచలు చేశాడు. ఒకే ఒక్క ట్వీట్‌తో దీపిక పరువు మొత్తం పోయింది.
పాపం సందీప్దేం తప్పు లేదు. కథ చెప్పాడు. అదీ నాన్ డిస్క్లోజర్ ఎగ్రిమెంట్ కూడా లేకుండానే కథ చెప్పాడు. ఆమె స్థాయిని గౌరవించే ఓ పద్ధతినే అనుసరించాడు. కానీ దీపికకే బాగా తలకెక్కిపోయింది. నిజానికి దీపిక సందీప్ ఛాయిస్ కానే కాదు. ప్రభాస్ సజెషనే అది. ఎందుకంటే కల్కి లాంటి అతి పెద్ద భారీ బ్లాక్‌బస్టర్ కలసి నటించారు, టీం వర్క్ బాగానే ఉంది అనే సదుద్దేశ్యంతోనే ప్రభాస్ సూచించాడు. సందీప్ కూడా గౌరవించి ఎవరైతే ఏంటిలే, కథ బాగున్నప్పుడు, తనమీద తనకి నమ్మకం ఉన్నప్పుడు అనుకున్నాడు.
కానీ అమ్మడు డిమాండ్లు మామ్మూలుగా లేవుగా. 30 కోట్లు రెమ్యూనరేషన్. 26 మంది మందిమార్బలం. సైన్ చేసిన డేట్స్ మించితే ఇంక అక్కడ నుంచి ప్రోరేటా మొదలవుతుంది. రోజుకి ఆరుగంటలే పని సమయం. తెలుగులో డబ్బింగ్ చెప్పదు. ఇంక సరే నయనతారని చూసి మిగతావాళ్ళు కూడా మొదలుపెట్టారు. పబ్లిసిటీ కేంపైన్కి రానని కండిషన్.
ఈ నరకాలు తట్టుకోలేక సందీప్ దీపికకి బదులుగా యానిమల్ యాక్ట్రస్ తృప్తిని సెలెక్ట్ చేసుకున్నాడు. దీపికకి ఎంత కుళ్ళు ఒచ్చినా అలా పిఆర్ టీంని బరిలోకి దించి, స్పిరిట్ సినిమా మొత్తం బూతు అని, వల్గారిటీకి పరాకాష్టని ప్రచారం చేయించకూడదు కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్కవుట్ కానప్పుడు కామ్‌గా తప్పుకోవాలి గానీ, మరొక నటిని దిగజార్చకూడదు కదా. అదే మరి సందీప్‌కి మండిపోయింది. తన పర్సనల్ ఎక్స్ హేండిల్ ద్వారా దీపిక తాట తీశాడు. ఎక్కడా ఓవర్ కాకుండా చాలా సున్నితంగా ఛీవాట్ల రూపంలో దీపిక ఒరిజినల్ నేచర్‌ని బాగా ఎక్స్పోజ్ చేశాడు. దేశం మొత్తం సందీప్‌కే వత్తాసు పలుకుతోంది. సందీప్, ప్రభాస్ కాంబినేషన్‌కి వాళ్ళద్దరే చాలు, మళ్ళీ దీపిక ఎందుకు అని కొందరు నెటిజన్లు కామెంటు పెడుతున్నారు.