E.G: ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పలు సమస్యలతో విచ్చేసిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.